Showing posts with label Ram Gopal Varma. Show all posts
Showing posts with label Ram Gopal Varma. Show all posts

Saturday, 5 March 2016

వర్మ ఇలా కూడా ఆలోచించగలడా

వర్మ ఇలా కూడా ఆలోచించగలడా

రామ్ గోపాల్ వర్మ అంటే చాలు.. అదో నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. ఏ విషయాన్నైనా సరే ఎండగట్టేయడం తనకు మాత్రమే నచ్చిన యాంగిల్ లో చీల్చి చెండాడేయగలడీ డైరెక్టర్. ఒక్కోసారి ఈయన మాటలు కరెక్టే అనిపించినా.. ఎక్కువ సార్లు ఇలా థింక్ చేయడం కేవలం వర్మకేసాధ్యం అనిపిస్తుంది. అలాంటి వర్మ ఓ విషయానికి అత్యంత పాజిటివ్ గా స్పందించాడు. అదే ఈయన సినిమాల హీరోయిన్ ఊర్మిళ పెళ్లి.

ఈ భామకు బూస్ట్ హార్లిక్స్ లాంటి వన్నీ పట్టించినది వర్మే. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ బ్రేక్ ఇచ్చి పెద్ద హీరోయిన్ ని చేశాడు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఊర్మిళ. ఇప్పుడు తనకంటే 7 ఏళ్లు చిన్నవాడైన 35 ఏళ్ల ఓ మోడల్ కం బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి సందర్భంగా వర్మ ఓ ట్వీట్ చేశాడు. 'నేను పనిచేసిన అందరిలో అత్యంత అందమైన హీరోయిన్ పెళ్లి చేసుకున్న సందర్భంగా చాలా చాలా సంతోషంగా ఉంది.. ఆమె జీవితం ఎప్పటికీ రంగీలా మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు వర్మ. 

పాజిటివ్ లో కూడా నెగిటివ్ లు వెతికి చీల్చి చెండాడే వర్మ.. ఊర్మిళ పెళ్లికి మాత్రం ఇంత సాఫ్ట్ గా రియాక్ట్ అవడం ఎనిమిది కాదు.. తొమ్మిదో వింత అనాలి. అందులోనూ గతంలో తనతో అఫైర్ ఉందనే రూమర్స్ ఉన్న హీరోయిన్ కి పెళ్లి అయిపోతే.. వర్మ ఇలా సాఫ్ట్ కూడా ఆలోచించగలడా అనిపిస్తోంది.